ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..

1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..

అర్జున్ సమాచారం ప్రతినిధి మంచిర్యాల సెప్టెంబర్ 5.

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా..

మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా దాదాపు 1000 బైక్‌ల భారీ ర్యాలీ..

మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా, సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు ఉత్సాహభరితంగా సాగింది..

ఈ భారీ ర్యాలీలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీపతి మల్లేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, మైనారిటీ నాయకులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..